పోస్ట్‌లు

నవంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

సువార్తికుడు

  సువార్తికుడు (Evangelist) 1. సువార్తికుడు అనే పదం బైబిలులో   ఎఫెసీయులకు 4:11, 2 తిమోతి 4:5, అపొస్తలుల కార్యములు 21:8  "సువార్తికుడు" అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభవార్తను ప్రకటించి, ప్రజలను క్రీస్తునొద్దకు నడిపించే వ్యక్తి. ఉదాహరణ: అపొస్తలుల కార్యములు 21:8 లో ఫిలిప్పును "సువార్తికుడు" అని పిలిచారు. ఆయన సమరయలోను, ఇతియోపీయ అధికారికి కూడా సువార్త ప్రకటించి క్రీస్తులోకి నడిపించాడు (అపొ.కా. 8). 2. సువార్తికుని ఎవరు ఏర్పాటు చేశారు? (1) దేవుడే ఏర్పాటు చేశాడు   ఎఫెసీయులకు 4:11  సంఘంలో అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులను ఏర్పాటు చేసినవాడు క్రీస్తే. (2) దేవుడు నియమించినవాడు  2 కొరింథీయులకు 2:17 సువార్తికుడు తన ఇష్టానుసారం కాదు; దేవుని పిలుపు, నియామకంతో సేవ చేయాలి. 3. సువార్తికుని ఎందుకు ఏర్పాటు చేశాడు? (1) అందరూ రక్షణ పొందుటకు 1 తిమోతి 2:4 రోమీయులకు 10:14-15 దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు. కానీ వినకుండా ఎవరూ విశ్వసించలేరు. అందుకే సువార్తికులు అవసరం. (2) ప్రపంచమంతటికి సువార్త చేరుటకు మార్కు 16:15  "సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష...