2. పిల్లలను ఎలా పెంచాలి?

 

 

పిల్లలను ఎలా పెంచాలి 

 


నేడు అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియడం లేదు వారిని అతి ప్రేమతో అతిగారాబంతో మొండివాడుగా సోమరిపోతులగా ఏమి విననివారుగా ఎంత చెప్పినా మారనివారుగా తమ తల్లిదండ్రులే తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని తమ మెరుగక మేము ఆ పిల్లలను ప్రేమిస్తున్నామనుకుంటూ బ్రమలో ఉన్నారు. పిల్లలకి ఏమీ తెలియదు వారి కంటే తల్లిదండ్రులైన వారికి మరీ ఇంకేమీ తెలియదు అని పెట్టి మనం గమనించవచ్చు గుర్తించవచ్చు గనుక ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఎలా పెంచాలో మొదటిగా తల్లిదండ్రులైన వారు ఎరగాలి తమ పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులను తెలుసుకుంటేనే తమ పిల్లలను ఎలా పెంచాలో ఎలా పెరుగుతారు అన్నది తర్వాత ఫలితం అనేది కనబడుతుంది. అందుకోసం దేవుడు తన గ్రంథంలో రాయించాడు దాన్ని చదివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దేవుని కోరుకుంటున్నాడు నేడు మనం కూడా అవి చదివి నేర్చుకొని మన పిల్లలను జాగ్రత్తగా పెంచుదాం నేర్పిద్దాం గొప్ప వారిగా తయారు చేద్దాం దేవుడు ఆశీర్వదించేలా మనుషులు మెచ్చుకునేలా పిల్లలను పెంచే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులైన వారి చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. 


దేవుడు మానవులందరినీ సృజించినవాడు. కీర్తనలు 100: 3

దేవుడు పిల్లలను పుట్టిస్తున్నాడు. కీర్తనలు 127: 3


ప్రతి కుటుంబం పాలు ప్రతి తల్లిదండ్రులు దేవుని దయవల్ల పిల్లలను పొందుకుంటున్నారు అయితే పొందుకున్న పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుంటున్నారా తెలుసా? 

దేవుడు పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నది. 

గ్రంథం తెలియజేస్తున్నది ప్రభు యొక్క శిక్షలోను బాధలోనూ పెంచాలి. 

ఎప్పేసి 6:4


 1. పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి. 

  • సంస్కారము గౌరవం మర్యాద నేర్పించాలి.సామెతలు 6:20-24/23:22
  • వాక్యం బోధించాలి. ద్వితీయోపదేశకాండము 6:6-9
  • బాల్యం నుండి నేర్పించాలి. 2తిమోతి 3:15

2. తల్లిదండ్రులు పిల్లలు నడవవలసిన త్రోవ నేర్పించాలి. 

  పిల్లలకు మంచి చెడు అనేవి తెలియకుండా నడుస్తూ ఉంటారు వాళ్ళు వెళుతున్న గమ్యం కూడా తెలియదు. సామెతలు 14: 12


3. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన కనిపెట్టాలి. 

  • దేవుని యందు భక్తి విషయంలో చూడాలి. యోబు 1: 5    1 సమూయేలు 2:12
  • భక్తిపరులతో సహవాసం చేస్తున్నారా లేదా చూడాలి. 2 తిమోతి 2:22


4. తల్లిదండ్రులు పిల్లలను శిక్షణలో పెంచాలి. 

  • శిక్షణలో పెంచితే జ్ఞానం కలుగును. సామెతలు 13: 1
  • నీ కుమారులను నువ్వు ప్రేమిస్తే నువ్వు శిక్షిస్తావు. సామెతలు 13: 24
  • బుద్ధి రావాలి అని శిక్షిస్తావు. సామెతలు 19: 18. 
  • మూడత్వము పోవాలని శిక్షిస్తావు. సామెతలు 22:15
  • పాతాళం పోకుండా వాణి ఆత్మను రక్షించుటకు శిక్షిస్తావు. సామెతలు 23:13,14

 పైన చెప్పినట్లు పిల్లలను పెంచకపోతే కలిగే నష్టం చెప్పిన విధంగా పెంచితే కలిగే ఫలితం. 

  • జ్ఞాన కలుగుతుంది. సామెతలు 13: 1
  • తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. సామెతలు 10: 1 / 15:20
  • అలా పెంచకపోతే తల్లిదండ్రులకు దుఃఖము కలుగుతుంది. సామెతలు 17: 25. /19:13


ప్రభువునందు మీ సహోదరుడు.

M. రాంబాబు గారు 

గడ్డిబంధ క్రీస్తు సంఘము 

Pho: 8500922110


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. దేవుని చిత్తము

సువార్తికుడు